Himachal CM: సుఖ్‌బీర్ సింగ్ సుఖుకు హిమాచల్ సీఎం పగ్గాలు
Sukhwinder Singh Sukhu to be next Himachal CM
హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ క్యాంపైన్ కమిటీ చైర్మన్ అయిన సుఖ్‌బీర్ సింగ్ సుఖుకు సీఎం పదవిని కట్టబెట్టింది. ముఖేష్ అగ్నిహోత్నికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. సీఎం పదవి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడింది. చివరకు సుఖ్‌బీర్ సింగ్ వైపు మొగ్గు చూపింది. చత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘేల్ సీఎం అభ్యర్ధి పేరు ప్రకటించారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ప్రతిభా సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తూ బీజేపీని హడలెత్తించారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య అయిన ప్రతిభా సింగ్ ప్రస్తుతం ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టారు. కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించారు. ఆమెకే సీఎం పదవి దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ అధిష్టానం సుఖ్‌బీర్ సింగ్ సుఖుకు కల్పించింది. దీంతో ప్రతిభా సింగ్ వర్గీయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
రేపు ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎం, డిప్యూటీ సీఎంలు మాత్రమే రేపు ప్రమాణం చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో క్యాబినెట్‌ను విస్తరించనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో గత మూడు దశాబ్ధాలుగా సుఖ్‌బీర్ సింగ్ సుఖు తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
డిసెంబర్ 8న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు లభించాయి. 68 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 35 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. మేజిక్ ఫిగర్ కన్నా 5 సీట్లు ఎక్కువే కాంగ్రెస్ పార్టీ సాధించింది.
JUST IN: Congress leader & 4-time MLA Sukhwinder Singh Sukhu to be next CM of Himachal Pradesh, Mukesh Agnihotri to be Deputy CM pic.twitter.com/8KnUQvIUEE
— Shiv Aroor (@ShivAroor) December 10, 2022
Sukhwinder Singh Sukhu to be next Himachal CM