Sonia Gandhi : నేడు ఈడీ ముందుకు మరోసారి సోనియా
National Herald Case: దేశంలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చించుకునే అంశం సోనియాగాంధీ గురించి. నేషనల్ హెరాల్డ్ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఇవాళ ఈడీ విచారణకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉన్నది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. రెండు రోజులు సుమారు 9 గంటలు పాటు సోనియా గాందీ ని విచారణ చేసిన ఈడి అధికారులు. దాదాపు 55 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
బుధవారం మరోసారి విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది.సోనియా వెంట ప్రియాంక గాంధీ కూడా వచ్చే అవకాశం ఉంది.రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలను, సోనియా గాంధీ ఇస్తున్న సమాధానాలతో ఈడి అధికారులు పోల్చి చూస్తున్నట్లు సమాచారం. సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించే అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసనలు తెలిపారు.అలాగే దేశం లోని పలు కాంగ్రెస్ నేతలు నిరసనలు చెప్పట్టారు.
ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులతో సహా రాహుల్ గాంధీ తో సహా మొత్తం 55 మంది ఎమ్.పిలను నిర్బంధం లోకి పోలీసులు తీసుకున్నారు.ఈ రోజు కూడా పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.