Sonia Gandhi: రణ్‌థంబోర్ టైగర్ పార్క్‌లో సోనియా కుటుంబం సఫారి
Sonia Gandhi: సోనియాగాంధీ 76వ జన్మదినం సందర్భంగా తన కుటుంబంతో కలిసి రణ్‌థంబోర్ టైగర్ పార్క్‌లో సఫారీ చేశారు. కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలతో కలిసి ఈ సాహసయాత్ర చేశారు. రణ్‌థంబోర్ టైగర్ నేషనల్ పార్క్‌లోని టైగర్ సఫారీలో విహరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి తన తల్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ చేరుకున్న సోనియా కుటుంబం, ఓపెన్‌టాప్ జీప్‌లో సఫారీ చేశారు. టైగర్ పార్క్ మొత్తం ఈ జీప్‌లో కలియ తిరిగి సందడి చేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తన భుజాన ఉండటంతో పార్టీ పనులతోనే బిజీగా ఉండిపోయారు. పార్టీ అధ్యక్షురాలిగా తప్పుకున్నాక జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకలు కావడంతో స్పెషల్‌గా జరుపుకోవాలని భావించిన సోనియా కుటుంబం రణ్‌థంబోర్ టైగర్ పార్క్‌లో వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.