Solar Eclipse 2023: ఈ ఏడాది నాలుగు గ్రహాణాలు… ప్రభావం ఉంటుందా?
Solar Eclipse 2023: దేశంలో ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ నాలుగు నాలుగు గ్రహణాల్లో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు. అయితే, ఈ ఏడాది ఏర్పడే రెండు సూర్యగ్రహణాల్లో మనదేశంలో కనిపించే అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు, పండితులు చెబుతున్నారు. ఇక చంద్రగ్రహణం ఒకటి రాత్రి సమయంలో ఏర్పడనుండగా, మరోకటి మద్యాహ్నం సమయంలో ఏర్పడుతుంది. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలలో సూర్యగ్రహణాలు, మే, అక్టోబర్ చివరిలో చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడే సమయంలో మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో బయటకు వస్తే ఆ కిరణాల ప్రభావం గర్భస్త శిశువుపై పడే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 20 వ తేదీ గురువారం రోజున మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుండగా, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14 వ తేదీ శనివారం రోజున ఏర్పడనున్నది. ఇక, ఏడాది మే 5వ తేదీ శుక్రవారం రోజున ఏర్పడనుండగా, రెండో చంద్ర గ్రహణం అక్టోబర్ 29వ తేదీ ఆదివారం రోజున ఏర్పడనున్నది. మే 29వ తేదీ పౌర్ణమి రోజు. అయితే, ఈ గ్రహణం మద్యాహ్నం 1.06 గంటలకు ప్రారంభమై మద్యాహ్నం 2.22 గంటలకు ముగుస్తుంది.