దేశంలో నవంబర్ 3 వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ సరళి ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. ఈ ఏడు నియోజక వర్గాల్లో ఆరు నియోజక వర్గాల్లో బీజేపీ పోటీ చేసింది. మహారాష్ట్రలోని అంధేరి పోటీ నుంచి బీజేపీ తప్పుకున్న సంగతి తెలిసిందే.
By Election Results: దేశంలో నవంబర్ 3 వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ సరళి ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. ఈ ఏడు నియోజక వర్గాల్లో ఆరు నియోజక వర్గాల్లో బీజేపీ పోటీ చేసింది. మహారాష్ట్రలోని అంధేరి పోటీ నుంచి బీజేపీ తప్పుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని మునుగోడు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని మునుగోడు, బీహార్లోని మోకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదంపూర్, ఉత్తరప్రదేశ్లోని గోల గొకరనాథ్, ఒడిశాలోని ధామ్ నగర్, మహారాష్ట్రలోని ఈస్ట్ అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరా హోరీ పోటీ జరుగుతున్నది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు తుదిఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.