Karnataka: కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది. ప్రమాణస్వీకారం అయిపోయినాక తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గంటల వ్యవధిలోనే నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ప్రకటించారు.
Karnataka: కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది. ప్రమాణస్వీకారం అయిపోయినాక తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గంటల వ్యవధిలోనే నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ప్రకటించారు. తాము పేదలు, దళితులు, ఆదివాసీల వెంట ఉన్నందుకే కాంగ్రెస్ గెలిచిందని వెల్లడించారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన తొలి కేబినెట్ మీటింగ్లో సిద్ధరామయ్య (Siddaramaiah) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలపై తొలి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వంగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఘనత సాధించింది.
ఆ ఐదు హామీలు ఇవే..
ఇకపోతే శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక నేతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. అలాగే నూతన కేబినెట్లో స్థానం సంపాదించుకున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు.