Security Thread -De La Rue Currency Scam: చిదరంబరం మాయా స్కామ్…
Security Thread -De La Rue Currency Scam: ప్రతి దేశం కరెన్సీ తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. నోట్ల తయారీలో వినియోగించే పేపర్, ఇంక్, సెక్యూరిటీ త్రెడ్ అన్నింటిలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. పేపర్ సప్లై చేసే కంపెనీ వివరాలను, సెక్యూరిటీ త్రెడ్‌లో ఉండే వివరాలను ఇప్పటికప్పుడు గమనిస్తూంటారు. నకిలీ నోట్ల బెడద నుండి బయటపడేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. నోట్లు తయారు చేసే సమయంలోనే వాటి ఎక్స్‌పైరీ డేట్‌ను కూడా నిర్ణయిస్తారు. ఇది పక్కాగా జరుగుతుంటుంది. కానీ, భారత్ లో పెద్ద నోట్ల రద్దు ముందు వరకు నోట్లకు ఎక్స్‌పైరీ లేదు. దీనిని ఆసరాగా తీసుకొని బడా నేతలు పలు రకాల స్కామ్‌లకు పాల్పడ్డారు. ఇలాంటి వాటిల్లో ఒకటి సెక్యూరిటీ త్రెడ్ స్కామ్.
ఈ స్కామ్‌కు 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో మొదలైంది. ఆర్థికశాఖా మంత్రిగా పనిచేసిన చిదంబంరం నోట్ల తయారీకోసం వినియోగించే పేపర్, ఇంక్, సెక్యూరిటీ త్రెడ్ కొనుగోలు అంశానికి సంబంధించిన ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థపేరు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఈ కార్పోరేషన్ రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లకు సంబంధించిన పేపర్‌ను ఎంపిక చేయడం, సెక్యూరిటీ త్రెడ్‌ను ఎంపిక చేయడం, పేపర్ ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలి, ఎంతకు కొనుగోలు చేయాలనే అంశాలను నిర్ణయించడం వంటివి చేస్తారు. మొత్తం ఈ కార్పోరేషన్ చేతుల్లోనే ఉంటుంది.
అయితే, ఇలాంటి కీలకమైన కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలి అంటే ముందు ఈ కార్పోరేషన్ ప్రతిపాదనను అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ముందు ఉంచాలి. క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదం పొందేలా చూడాలి. క్యాబినెట్ ఆమోదం పొందితేనే ఇలాంటి కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయడం సాధ్యం అవుతుంది. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం అవేమి చేయలేదు. చిదరంబం కార్పోరేషన్ ఏర్పాటును రహస్యంగానే ఉంచారు. పైగా అందులో ఆర్థికశాఖ సెక్రటరీగా ఉన్న మాయారామ్‌ను ఈ కార్పోరేషన్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అడిషనల్ సెక్రటరీని ఈ కార్పోరేషన్ ఫౌండర్ చైర్మన్‌గా నియమించాడు.
చిదంబరంకు ఏం కావాలో మాయరామ్‌కు బాగా తెలుసు. కరెన్సీ పేపర్‌ను, సెక్యూరిటీ త్రెడ్‌ను సప్లై చేసే డె లా రూ కంపెనిని సంప్రదించి పేపర్ కొనుగోలుకు చేయడం మొదలుపెట్టారు. మాయారావ్ చెప్పిన ధరకే పేపర్ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. 2005 నుండి ఈ కొనుగోలు వ్యవహారం నడుస్తూనే ఉన్నది. అయితే 2010లో డె లా రు సప్లై చేస్తున్న పేపర్ నాసీరకంగా ఉందని తేల్చింది. దీంతో ఆ కంపెనీ నుండి పేపర్ కొనుగోలు చేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది ఆర్బీఐ. కానీ, చిదంబరం కలుగజేసుకొని డె లా రు ను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించాలని కోరుతూ హోంశాఖకు లెటర్ రాశారు. దీంతో యూపీఏ ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక శాఖ నుండి తొలగించి హోంశాఖను, హోంశాఖ మంత్రిగా ఉన్న ప్రణభ్‌ను ఆర్థికశాఖకు బదిలీ చేసింది. ఆ ప్రణభ్‌కు రాష్ట్రపతి హోదా నిర్ణయం కావడంతో చిదంబరంకు తిరిగి ఆర్థిక శాఖ కేటాయించారు. తనకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న మాయరావ్‌కు పదోన్నత కల్పించి కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీగా నియమించారు.
ఆర్థికశాఖ సెక్రటరీ హోదాలో ఆయన హోంశాఖకు లెటర్ రాశారు. అప్పటి నుండి తాత్కాలికంగా మరలా పేపర్ సప్లై చేయడం మొదలైంది. అయితే, 2014 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థికశాఖాధికారులు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రాజ్‌నాథ్ సింగ్ దీనిని ప్రధాని దృష్టికి తీసుకురావడంతో డె లా రు కంపెనీని బ్లాక్ లిస్ట్ లో ఉంచి, దీనిపై విజులెన్స్ ఎంక్వైరీ వేయాలని ఆదేశించారు. విజులెన్స్ ఎంక్వైరీ అధికారి రాజీవ్ ఎన్‌క్వైరీ కోసం ఫైళ్లను పంపాలని కోరినా ఆర్థిక శాఖ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి ప్రధాని జోక్యం చేసుకోవలసి వచ్చింది. ప్రధాని మోడీ జోక్యం చేసుకోవడంతో ఫైళ్లను విజులెన్స్ ఎన్‌క్వైరీకి పంపారు.
ఇక, 2015 నుండి బీజేపీ ప్రభుత్వం మరో కంపెనీ నుండి కరెన్సీ పేపర్, సెక్యూరిటీ త్రెడ్‌ను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన పేపర్ ఖరీదు 2005 నుండి యూపీఏ ప్రభుత్వం కొనుగోలు చేసిన పేపర్ ఖరీదులో సగం ఉండటంతో అనేక అనుమాలు కలిగాయి. అంతేకాదు, డె లా రు కంపెనీ గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్‌క్వైరీ చేయడంతో ఆ కంపెనీ సెక్యూరిటీ త్రెడ్‌కు ఎలాంటి పేటెంట్ హక్కులు లేవని తేలింది. ఈ కంపెనీనే పాకిస్తాన్‌కు కూడా పేపర్‌కు సప్లై చేస్తున్నది. పాక్‌లో భారత్‌కు చెందిన 500, 1000 నోట్ల ముద్రణ అధికంగా జరిగింది. అక్కడి నుండే ఉగ్రవాద సంస్థలకు నోట్ల పంపిణీ జరిగేది.
ఇదంతా గమనించిన భారత ప్రభుత్వం 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. భారత్ లో నోట్ల రద్దు ప్రకటన తరువాత పాకిస్తాన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. పాక్ స్టాక్ ఎక్చేంజీలో పనిచేసే పలువురు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులకు భారత కరెన్సీ దొరక్క అవస్థలు పడ్డారు. ఉగ్రవాదాన్ని దెబ్బకొట్టడంతో పాటు, దేశంలో చాపకింద నీరులా జరిగిన సెక్యూరిటీ త్రెడ్ స్కామ్‌ను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుగుతున్నది.