Rooh Afza: రూహ్ అఫ్జా (Rooh Afza) అనే సాఫ్ట్ డ్రింక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు (Delhi highcourt) ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (supreme court) కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
Rooh Afza: రూహ్ అఫ్జా (Rooh Afza) అనే సాఫ్ట్ డ్రింక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు (Delhi highcourt) ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (supreme court) కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనన్న ధర్మాసనం.. అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
కాగా, దిల్ అఫ్జా అనే షర్బత్ తమ రూహ్ అఫ్జా మాదిరిగానే మోసపూరితంగా ఉందని ఆరోపిస్తూ హమ్దార్డ్ సంస్థ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన దావాను దాఖలు చేసింది. దీనిపై గతేడాది డిసెంబర్లో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. దిల్ అఫ్జా అనే షర్బత్‌ను విక్రయించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దిల్ అఫ్జా తయారీ దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ‘‘రూహ్ అఫ్జాకు దేశమంతటా మంచి పేరు ఉంది. మీరు మధ్యలో విక్రయాలు మొదలు పెట్టారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే. అందులో మేము జోక్యం చేసుకోలేము’’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టిపారేసింది.
ఇకపోతే 1906లో హకీమ్ హఫీజ్ అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి రూహ్ అఫ్జాను తయారు చేశారు. యునాని ఔషదాలను వినియోగించి దీనిని తయారు చేశారు. మొదట్లో దీనిని ఓల్డ్ ఢిల్లీలో విక్రయించే వారు. క్రమంలో ఆ డ్రింక్‌కు ఆదరణ పెరగడంతో దేశవ్యాప్తంగా విక్రయించడం మొదలు పెట్టారు. రంజాన్ మాసంలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నీటితో రూహ్ అఫ్జాను కలిపి షర్బత్ తయారు చేస్తారు. కుల్ఫీ, లస్సీ వంటివి తాయరు చేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తారు.