SATYENDAR JAIN : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyandra Jain) తీవ్ర అస్వస్థతకు గురవడంతో సుప్రీంకోర్టు(Supreem Court)ఇంటీరియం బెయిల్ (Bail) మంజూరు చేసింది. గత ఏడాది మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయి.. తిహార్ (Tihar Jail) జైలులో ఉన్న ఆయన గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో బాత్రూంలో పడిపోయారు. దీంతో జైన్‌ను(minister Satyendar Jain) గదికి తరలించి వైద్యులు పరిశీలించారు. వారి సూచన మేరకు తొలుత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన ఐసీయూలో ఆక్సిజన్ మద్దతుతో చికిత్స పొందుతున్నారు. తనకు వెన్నెముక, ఎడమ కాలు, భుజం నొప్పి ఉందని జైన్ వైద్యులకు తెలిపారు.
ఏడాదిగా జైల్లోనే..
ఢిల్లీ మాజీ మంత్రి ఏడాదిగా తిహార్ జైలులోని సెల్ నం.7లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్నారు.ఆ సందర్భంగా శారీరకంగా బాగా నీరసంగా కనిపిస్తున్న ఫొటోలను ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బయటపెట్టారు. జైన్ 35 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా ఇదే విషయాన్ని తెలిపారు.