Sasikala comments on EPS and OPS: త్వరలోనే వారిద్దరిని కలుస్తా
Sasikala comments on EPS and OPS: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీలోని నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్టీలో బలాన్ని బలగాన్ని పెంచుకునేందుకు పళనీస్వామి, పన్నీర్ సెల్వంలో ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఇది అధికార డీఎంకేకు లాభం చేకూరుస్తున్నది. అన్నాడీఎంకే బలహీనమవడంతో డీఎంకేకు తిరుగులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చిన్నమ్మ శశికళ కీలక వ్యాఖ్యలు చేసింది.
రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఎదుర్కొనాలంటే తప్పనిసరిగా పార్టీలో ఐక్యత అవసరం ఉందని, పళనీస్వామీ, పన్నీర్ సెల్వం బలమైన నేతలు అని, వారిద్దరూ కలిసి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు. త్వరలోనే వారిని కలుస్తానని, ఇద్దర్ని కలిపి ఉంచేలా చేస్తానని అన్నారు. తమ పార్టీ నేతలను కలిసేందుకు తనకెటువంటి భయం లేదని, పార్టీలో ఐక్యత గురించే తన ఆందోళన అని అన్నారు. డీఎంకే అధికాంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని శశికళ ఈ సందర్భంగా తెలియజేశారు.