Meghalaya: మేఘాలయ సీఎంగా మళ్లీ ఆయనే
Meghalaya: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు దక్కించుకుంది. 59 నియోజకవర్గాలున్న మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 30. అయితే నేషనల్ పీపుల్స్ పార్టీమేజిక్ ఫిగర్‌ను చేరుకోకపోయినప్పటికీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా సిద్ధమయ్యారు. ఈ మేరకు మేఘాలయ గవర్నర్ పగు చౌహాన్ ను సంగ్మా శుక్రవారం కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. ఇందుకు బీజేపీ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో 60 స్థానాలకు గాను 59 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్‍పీపీ 26 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ మార్కు 31గా ఉంది. అయితే తమకు ఇప్పటికే 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు సంగ్మా చెప్పారు. మార్చి 7న సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని తెలిపాయి. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి ఉన్న అవినీతి ఆరోపణలతో విడిపోయాయి. తాజాగా బీజేపీ ఎన్‍పీపీకి సపోర్ట్ ను అందిస్తుంది.