Sabarimala Temple: అయ్యప్ప ప్రసాదం విక్రయం నిలిపివేత!
Sabarimala Temple stops distribution of ‘aravana’: శబరిమల ఆలయంలో క్రిమిసంహారక మందులు కలిపిన ఏలకులతో చేసిన అరవణం ప్రసాద పంపిణీని నిషేధించారు. అరవన్ ప్రసాద పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ)ని కేరళ హైకోర్టు బుధవారం ఆదేశించింది. టీడీబీ అధ్యక్షుడు కె.అనంతగోపాలన్ మాట్లాడుతూ.. కోర్టు ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రసాద పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆలయ అధికారులను ఆదేశించామన్నారు. మరోవైపు, పండుగల సీజన్‌లో ఇలాంటి ఉత్తర్వులు రావడంపై సీపీఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, పురుగుమందులతో కూడిన ఏలకులతో చేసిన అరవణం అనే ప్రసాదానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు 300 కిలోల బరువున్న అరవణం మిశ్రమంలో 750 గ్రాముల ఏలకులు మాత్రమే ఉంటాయి.
అయితే తాజాగా రాష్ట్ర – కేంద్ర లాబ్స్ ద్వారా శాస్త్రీయ విశ్లేషణ తర్వాత, పురుగుమందుల ఉనికి దాదాపు 0.01 శాతం ఉన్నట్లు కనుగొనబడింది, ఇది ఆమోదించబడిన ప్రమాణం కంటే ఎక్కువ కావడంతో పంపిణీని నిలిపివేయాలని కోర్టు కోరింది. దీంతో వెంటనే ఆ ప్రసాద పంపిణీ నిలిపివేశారు. ఇక ఆ ఏలకులు ఉపయోగించకుండా ఉత్పత్తిని పునఃప్రారంభించాలని ఉత్పత్తి యూనిట్‌ను కోరామని, ఆ ప్రసాదాన్ని రేపటి నుంచి భక్తులకు పంపిణీ చేస్తామని టీడీబీ చైర్మన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రెండు నెలల పండుగ సీజన్‌లో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ప్రతి యాత్రికుడు తిరిగి వెళ్లేప్పుడు తీసుకువెళ్లే ఈ అరవణం చాలా ముఖ్యమైనదని, ఇప్పుడు ఏం చేయాలనేది 14వ తేదీ తర్వాత ఆలోచిస్తామని అప్పటి వరకు అరవణం ఏలకులు లేకుండా తయారు చేస్తారని అన్నారు.