Makara Jyothi: శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. మారుమ్రోగిన శబరిగిరులు!
Sabarimala Makara Jyothi: అయ్యప్ప భక్తులందరూ అత్యంత పవిత్రంగా భావించే మకరజ్యోతి ఎట్టకేలకు వారికి దర్శనమిచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప మాలధారులు, అయ్యప్ప భక్తులు శబరిమలలో జ్యోతి దర్శనం కోసం వేచి ఉండగా మూడు సార్లు పొన్నం పొన్నంబలమేడు కొండమీద మకరజ్యోతి ప్రత్యక్షం కాగానే శబరిగురులన్నీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అనే అయ్యప్ప నినాదాలతో మారుమ్రోగాయి. ప్రతి ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా కేరళలో జరుపుకునే మకరవిళక్కు నేపథ్యంలో శబరిమల క్షేత్రం దగ్గరలో ఉన్న పొన్నంబలమేడు అనే పర్వతం మీద మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండా మీద ప్రత్యక్షమయ్యే ఈ జ్యోతి అత్యంత పరమ పవిత్రమైనదని అయ్యప్ప భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ముందుగా ఈ జ్యోతి దైవ రహస్యం అని భావిస్తూ వచ్చారు కానీ తర్వాతి కాలంలో తామే పూజా కార్యక్రమాలలో భాగంగా ఆ జ్యోతిని వెలిగిస్తామని శబరిమల ఆలయ నిర్వహణ చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన సంగతి అందరికీ విదితమే.