Tamil Nadu: ఆ నిర్మాతల వద్ద 200 కోట్ల లెక్క చూపని డబ్బు?
Rs 200 crores un accountable Money Found at Tamil Nadu IT Raids: తమిళనాడులోని కొంతమంది సినీ నిర్మాతలు, పంపిణీదారులు సహా ఫైనాన్షియర్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం ద్వారా రూ.200 కోట్ల లెక్కల్లో లేని సొమ్ములు వెలికితీసింది. తమిళనాడులోని పలు పెద్ద నగరాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహించినట్లు సీబీడీటీ శనివారం సమాచారం అందించింది. ఆగస్టు 2న ఈ రైడ్స్ ప్రారంభించారు. చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరులోని దాదాపు 40 ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరిగాయి. అయితే, ఐటి తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు చేసింది. ఈ దాడుల్లో రూ.26 కోట్ల విలువైన నగదు, రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అలాగే ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో లేని డబ్బు నుగొన్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ అనేక పత్రాలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు సహా పెట్టుబడులకు సంబంధించిన డిజిటల్ సాధనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ల విషయంలో, సాధారణ అకౌంట్ బుక్స్ లో చూపిన మొత్తం కంటే సినిమాల రిలీజ్ తరువాత వచ్చిన మొత్తం చాలా ఎక్కువ అని అలా పన్ను ఎగవేయడానికి యత్నించారని పేర్కొన్నారు.