మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
పెట్రోల్, డీజిల్ ధరలు చమురు కంపెనీలు ఈరోజు మళ్లీ పెంచాయి. పెట్రోల్ ధర 28 నుంచి 32 పైసలు పెరగగా, డీజిల్ ధర కూడా 33 నుంచి 37 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ లీటరుకు రూ.99.41 లభిస్తుండగా, డీజిల్ లీటరుకు రూ.90.77గా లభిస్తుంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.114.19 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.98.50గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.108.85 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.93.92. అదే సమయంలో చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.95.33గా ఉంది. ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను తాజాగా ప్రకటించాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధర తగ్గినా ఇండియాలో బాదుడు కొనసాగుతోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరుకోవడంతో డీజిల్ బల్క్ కొనుగోలుదారుల కోసం చమురు కంపెనీలు ఆదివారం లీటరుకు రూ.25 పెంచాయి. క్రమేణా రిటైల్ ధరను పెంచుతామని చమురు డీలర్లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. క్రూడ్ ధరలు 113 డాలర్లకు దిగి వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 3.53 శాతం తగ్గింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 113.23 డాలర్లకు క్షీణించింది. అదే సమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 3.68 శాతం తగ్గింది. దీంతో ఈ రేటు 109.72 డాలర్లకు క్షీణించింది.