RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. రెండు వేల రూపాయల నోట్లు ఉన్నవారంతా సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అలాగే మే 23 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో మార్చుకోవచ్చని సూచించింది.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. రెండు వేల రూపాయల నోట్లు ఉన్నవారంతా సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అలాగే మే 23 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో మార్చుకోవచ్చని తెలిపింది.
ఒక్కొక్కరు ఒక విడతలో కేవలం 10 నోట్లు మాత్రమే అంటే రూ. 20 వేలను మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే రూ. 2 వేల నోట్లను సర్క్యులేషన్లో ఉంచవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రనను నిలిపివేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 3.52 లక్షల కోట్ల 2 వేల నోట్లు చలామనీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ మనీని అరికట్టే విషయంలో ఇది కీలక ముందడుగు అని వెల్లడించారు.
అయితే కొంతకాలంగా రెండువేల నోట్లను ఆర్బీఐ రద్దు చేయబోతుందని ప్రచారం జరుగతోంది. ఈక్రమంలో కొద్దిరోజులుగా రూ. 2 వేల నోట్లు తక్కువగా కనిపిస్తున్నాయి. సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. చాలా అంతకముందే నోట్లను మార్చేసుకున్నారు.
ఇక మరోవైపు త్వరలో జరగనున్న జనరల్ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చల విడిగా రూ. 2 వేల నోట్లను ఖర్చు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రూ. 2 వేల నోట్లను బ్యాన్ చేసిందని పలువురు అంటున్నారు. అంతకముందు కూడా కేంద్రం ఎన్నికల ముందు రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాన్ చేసి.. కొత్తగా రూ. 500, రూ. 2000 వేల నోట్లను ప్రవేశపెట్టింది.
ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023