Republic Day Rehearsal at Shaktipat: నేడు ఫుల్ డ్రస్ రిహార్సిల్… భారీ భద్రత ఏర్పాటు
Republic Day Rehearsal at Shaktipat: జనవరి 26వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోగణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం అవుతున్నది. ఈ పరేడ్‌కు సంబంధించిన రిహార్సిల్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ డ్రస్సుల్లో రిహార్సిల్స్ జరగ్గా నేడు ఫుల్ డ్రస్ రిహార్సిల్స్‌ను నిర్వహిస్తున్నారు. విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు ఈ ఫుల్ డ్రస్ రిహార్సిల్స్ జరగనున్నాయి. నేడు పుల్ డ్రస్ రిహార్సిల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విజయ్ చౌక్, ఎర్రకోట తదితర ప్రాంతాల్లో ప్రయాణించేవారు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో ఏర్పాట్లను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో ఖలిస్తాన్ పేరుతో పోస్టర్ల కలకలం రేగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అనుమతి ఉన్నవారికే విజయ్ చౌక్ వైపు వచ్చేందుకు అనుమతులు ఇస్తున్నారు.