IPL2022: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. డుప్లెసిస్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతుండగా.. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నాయకత్వంలో ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో నైనా గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని CSK భావిస్తుంది.
మరోవైపు ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 28 సార్లు తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 9 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల బలాబలాలు చూస్తే.. చెన్నై జట్టులో ఎంఎస్ ధోని, రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టలో డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ్ కౌల్‌లాంటి ప్లేయర్స్ ఉన్నారు.