Delhi liquor Scam: రామచంద్ర పిళ్లై రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు
Rama Chandra Pillai remand report in Delhi Liquor Scam
ఢిల్లీ లిక్క ర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా రామచంద్ర పిళ్లైను అరెస్టు చేసింది. విచారణలో అనేక విషయాలు రాబట్టింది. ఈడీ అరెస్టు చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై రిపోర్టులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రామచంద్ర పిళ్లై ఎమ్మెల్సీ కవిత బినామీగా ఉన్నారని… కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పనిచేశారని ఈడీ తేల్చింది. తాను కవిత ప్రతినిధిని అని పిళ్లై అనేక సార్లు తమ విచారణ సందర్భంగా తెలిపారని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పిళ్లై కీలక పాత్ర పోషించారని..ఇండో స్పిరిట్ స్థాపనలో పిళ్లై ఉన్నారని ఈడీ తెలిపింది.
ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్లు కూడా పిళ్లై చెప్పారని ఈడీ తెలిపింది. 100 కోట్ల పెట్టుబడులు పెట్టి 292 కోట్లు సంపాదించారని ఈడీ వివరించింది. మద్యం పాలసీ రూపకల్పనలో పిళ్లై కీలక పాత్రధాని అని 17 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది.
అరుణ్ రామచంద్ర పిళ్లై సౌత్ గ్రూప్ కి సారధ్యం వహించారని, ఢిల్లీ ప్రభుత్వపు లిక్కర్ పాలసీ రూపొందించడంలోను, పాలసీ అమలు చేయడంలోను కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు తేల్చారు.