President Murmu: రాష్ట్రపతి కాళ్ళుమొక్కిన ఇంజినీర్..ఆతర్వాత ఏమైంది?
President Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలను తాకి ఓ అధికారి సస్పెండ్ అయింది. వివరాల్లోకి వెళితే ..జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి రాజస్థాన్‌లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్‌లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచి చూస్తున్నారు. రాష్ట్రపతి చేరుకోగానే.. ప్రొటోకాల్ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిణి రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు యత్నించారు.
ఒక్కసారిగా ఆ అధికారి ముందుకొచ్చి ముర్ము కాళ్ళుమొక్కే ప్రయత్నం చేసింది ఈ సంఘటనతో తేరుకున్న సిబ్బంది, అలాగే రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన తీవ్రంగా పరిగణించిన కేంద్ర హౌంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. ఈ సంఘటన జరిగిన సరిగ్గా 10 రోజులకు ఆ అధికారిపై చర్యలు తీసుకుంది. రాజస్థాన్ ప్రభుత్వం.. ఆ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసింది. మరి ఈ విషయం పై రాష్ట్రపతి స్పందనేంటో చూడాలి.
A female engineer, who touched the feet of President Draupadi Murmu, has been suspended by the Rajasthan government, Video surfaced#thesummernews #DraupadiMurmu #president pic.twitter.com/U1SehLfY7A
— The Summer News (@TheSummerNews2) January 14, 2023