Rahul Gandhi: బ్రిటన్ పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగం
Rahul gandhi will be speaking at the British Parliament
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలో బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసగించనున్నారు. అదే విధంగా బ్రిటన్ స్థిరపడిన భారతీయులను కూడా రాహుల్ గాంధీ కలవనున్నారు. వారి బాగోగులు తెలుసుకోనున్నారు.
మార్చి 4 నుంచి మార్చి 6 వరకు రాహుల్ గాంధీ లండన్ లో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఓవర్సీస్ కాంగ్రెస్ హెడ్ సామ్ పిట్రోడా కూడా ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించిన రోజే రాహుల్ గాంధీ బ్రిటన్ థింక్ ట్యాంక్ గా భావింపబడే చాథమ్ హౌస్ లో కూడా ప్రసంగించనున్నారు.
వీటితో పాటు లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ నేత డేవిడ్ లమ్మీతో కూడా రాహుల్ గాంధీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది. ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.