Rahul Gandhi: దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi). ఎంపీగా తనపై అనర్హత వేటు పడినాక ప్రజలతో మరింత మమేకమవుతున్నారు.
Rahul Gandhi: దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi). ఎంపీగా తనపై అనర్హత వేటు పడినాక ప్రజలకు మరింత దగ్గరగా ఉంటున్నారు. సాధారణ పౌరుడిగా జనాలతో కలిపోతున్నారు. దగ్గరుండి మరీ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యలకు పరిష్కారం చూపే దిషిగా ముందుకు సాగుతున్నారు. మొన్న కర్ణాటక ఎన్నికల (Karnataka elections) సమయంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్.. ఇప్పుడు లారీలో ప్రయాణించారు.
సోమవారం తన తల్లిని కలిసేందుకు రాహుల్ గాంధీ శిమ్లా పయనమయ్యారు. ఈక్రమంలో మార్గం మధ్యలో ఆయనకు లోడుతో వెళ్తున్న లారీలు కనిపించగా.. వాటిని ఆపి లారీ ఎక్కి ప్రయాణించారు. డ్రైవర్ సీటు పక్కన కూర్చొని వారితో ముచ్చటించారు. వారి జీతం ఎంత ఉంటుంది?.. కుటుంబ సభ్యులకు దూరంగా ఎలా ఉంటున్నారు?.. రోజు డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇతర అంశాలపై వారితో చర్చించారు. అలాగే ఓ డాబా దగ్గర ఆగి లారీ డ్రైవర్లందరితో మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు లారీలోనే ప్రయాణించారు. వారి సమస్యలను తెలుసుకున్న రాహుల్.. సాధ్యమైనంత వరకు ఆ సమస్యలను పరష్కరించేందుకు కృషి చేస్తానని డ్రైవర్లకు హామీ ఇచ్చారు.
ఇక రాహుల్ గాంధీ లారీలో ప్రయాణించిన ఫొటోలను, వీడియోలను పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాహుల్ ప్రజల మనిషి అని.. ఎంపీగా అనర్హత వేటు వేసినా జనాల నుంచి ఆయన్ను వీడదీయలేరని కామెంట్లు పెడుతున్నారు. లారీ డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణించారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సామాన్య ప్రజలు, ఆటో డ్రైవర్లు, ట్రక్కు, లారీల డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ప్రజలతో మమేకమైన వ్యక్తి.. వారి మంచి కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా వెనుకాడరని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
ఇకపోతే కొంతకాలంగా పేదలు, చిన్న వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కామన్ మ్యాన్‌గా బస్సులో ప్రయాణించి జనాల సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఓ డెలివరీ బాయ్ బైక్‌పై కూడా ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో నెట్టింట్లో వైరలయ్యాయి.
यूनिवर्सिटी के छात्रों से
खिलाड़ियों से
सिविल सर्विस की तैयारी कर रहे युवाओं से
किसानों से
डिलीवरी पार्टनरों से
बस में आम नागरिकों से
और अब आधी रात को ट्रक के ड्राइवर से
आख़िर क्यों मुलाक़ात कर रहे हैं राहुल गांधी?
क्योंकि वो इस देश लोगों की बात सुनना चाहते हैं,… pic.twitter.com/HBxavsUv4f
— Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023