Rahul Gandhi fires on RSS: ప్రాణంపోయినా ఆర్ఎస్ఎస్ లోకి అడుగుపెట్టను
Rahul Gandhi fires on RSS: కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ యాత్రలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు వరుణ్ గాంధీపైనా, ఆర్ఎస్ఎస్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తన బొందిలో ప్రాణమున్నంత వరకు తాను ఆర్ఎస్ఎస్ కార్యాలయాలనికి వెళ్లేది లేదని, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఇక తన సోదరుడు వరుణ్ గాంధీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ అనుసరిస్తున్న సిద్ధాంతాలను తాను ఎన్నటికీ అంగీకరించలనేనని అన్నారు.
తన కుటుంబానికి ఒక భావజాలం, సిద్దాంతాలు ఉన్నాయని, తాను ఆ బాటలోనే నడుస్తున్నానని అన్నారు. కానీ, వరుణ్ గాంధీ ఎంచుకున్న మార్గం, సిద్ధాంతం, భావజాలం వేరు అని, తమ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే వాటికి తాను దూరంగా ఉంటానని, అదేవిధంగా వరుణ్ గాంధీకి కూడా దూరంగా ఉంటానని అన్నారు. సోదరుడిగా వస్తే ప్రేమగా కలుస్తామని, కానీ, ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాలను మాత్రం తాను ఎన్నటికీ అంగీకరించలేనని అన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు మంచి ఆదరణ వస్తున్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆయన యాత్రను పూర్తి చేశారు. గతేడాది సెప్టెంబర్ 7 వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో యాత్రను అధికారికంగా ప్రారంభించారు.