Rahul Gandhi comments on Modi and RSS: ఆ రాహుల్ ఇప్పుడు లేదు… వారు 21వ శతాబ్ధపు కౌరవులు
Rahul Gandhi comments on Modi and RSS: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానాలోని కురుక్షేత్రలో జరుగుతున్నది. కురుక్షేత్రలోని ఖానాపూర్ కొలియాన్‌లో జరిగిన సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనలో పాత రాహుల్ ఇప్పుడు లేడని, ఇమేజ్ కోసం పాకులాడటం లేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి, ప్రధాని మోడీ గురించి రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ 21 వ శతాబ్ధపు కౌరవులుగా వర్ణించారు. వారంతా ఖాకీ నిక్కరు ధరించి చేతిలో లాఠీ పట్టుకుంటారని, వారి చుట్టు కొంతమంది కుబేరులు ఉంటారని విమర్శించారు. ఈ కౌరవుల కారణంగా దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీని పాండవులతో పోలుస్తూ… పాండవులు నోట్లను రద్దు చేస్తారా? జీఎస్టీ అమలు చేస్తారా అని ప్రశ్నించారు. మోడీ ఇవన్నీ చేశారని దుయ్యబట్టారు. అక్కడితో ఆగకుండా పూజారుల గురించి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. భారత దేశం తపస్వీల దేశమని, పూజారుల కోసం కాదని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ అట్టుడికి పోయింది. ఒక వర్గం వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సరికాదని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. భారత్ జోడో అంటూ యాత్రలు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చించారు.