చైనా తమ దేశానికి చెందిన స్టాండర్డ్ మ్యాప్‌ను (Map) రిలీజ్ చేసింది. అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ భూభాగాలు తమ దేశంలో ఉన్నట్లు చైనా కొత్త మ్యాప్‌లో పేర్కొంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీపై మరోసారి భగ్గుమన్నారు.
Rahul Gandhi: భారత భూభాగాన్ని చైనా (China) లాక్కుందని కొద్దిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క అంగుళం కూడా లాక్కోలేదని ప్రధాని మోడీ (PM Modi) చెప్పేవన్నీ అబద్ధాలేనని చెబుతున్నారు. తాజాగా చైనా తమ దేశానికి చెందిన స్టాండర్డ్ మ్యాప్‌ను (Map) రిలీజ్ చేసింది. అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, తైవాన్ భూభాగాలు తమ దేశంలో ఉన్నట్లు చైనా కొత్త మ్యాప్‌లో పేర్కొంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీపై మరోసారి భగ్గుమన్నారు.
భారత భూభాగాన్ని చైనా లాగేసుకుంది అనేందుకు ఇదే సాక్ష్యమని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మ్యాప్ అంశం చాలా తీవ్రమైనదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ వెంటనే చైనా రిలీజ్ చేసిన మ్యాప్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లడఖ‌్‌లో అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని మోడీ చెప్తున్నారన్న రాహుల్ గాంధీ.. ఆవన్నీ అబద్ధాలేనని కొన్నేళ్లుగా తాను మొత్తుకుంటున్నానని వెల్లడించారు. ఇప్పటికైనా మోడీ మేలుకోవాలన్నారు.
భారత్ కొద్దిరోజుల్లో జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమయంలో చైనా మ్యాప్‌ను రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. అటు భారత విదేటశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ మ్యాప్‌పై స్పందించారు. చైనా ఆధారాలు లేకుండా మ్యాప్‌ను రూపొందించిందని.. సరిహద్దు వివాదాన్ని మరింత రగిల్చిందని జైశంకర్ మండిపడ్డారు.