Raghuram Rajan: రాహుల్ తెలివైన వ్యక్తి.. RBI మాజీ గవర్నర్
Raghuram Rajan: రాహుల్ గాంధీ ఏ విధంగానూ ‘పప్పు’కాదు ‘తెలివిగల వ్యక్తి’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అందరు అతనిని పప్పు అంటున్నారు కానీ అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు ఆయనతో సంభాషిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది అతను ఓ మేధావి అని..కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు..ఈయన్ని పప్పు అంటే బాధగా ఉందన్నాడు.
నేనురాహుల్ తో అనేక రంగాలలో సంభాషిస్తూ దాదాపు ఒక దశాబ్దం పాటు గడిపాను. అతను ఏ విధంగానూ పప్పు కాదు… అతను తెలివైనవాడు, యువకుడు, ఉత్సుకత గల వ్యక్తి, అని అన్నాడు. భారత్ జోడో యాత్రలో చేపట్టిన తర్వాత ఎంతోమంది ఆయనతో సంబాషించారన్నారు. వారందరికీ అర్ధమయ్యే ఉంటుంది. దేశములో గొప్ప వ్యక్తి ఆయనేనని అన్నారు. ప్రస్తుతం దేశం అభివృద్ధికి అవసరమైన “సంస్కరణలను” రూపొందించడంలో విఫలమైందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించానని అన్నారు. తాను నమ్మే విలువలను పాటిస్తున్నందున భారత్ జోడో యాత్ర లో పాల్గొన్నానని ఆయన చెప్పారు.