Rahul Gandhi: గెడ్డం తొలగించిన రాహుల్ గాంధీ, న్యూ గెటప్ అదుర్స్
Rahul Gandhi looking Samar in his New look
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎట్టకేలకు గెడ్డం తొలగించారు. కొత్త లుక్ తో దర్శనమిచ్చారు. లండన్ నగరంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ నయా గెటప్ తో కనిపించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత్ జోడో యాత్ర మొదలైన దగ్గర నుంచి రాహుల్ గాంధీ గడ్డం తీయలేదు. గుబురు గెడ్డంతోనే భారత్ జోడో యాత్ర పూర్తిచేశారు. పార్లమెంట్ సమావేశాలలో కూడా గుబురు గెడ్డంతోనే దర్శనమిచ్చారు.
తాజాగా లండన్ ప్రయాణానికి బయలు దేరే మందు రాహుల్ గాంధీ తన లుక్ మార్పుకున్నారు. జట్టు, గెడ్డం ఫుల్ గా ట్రిమ్ చేసుకున్న రాహుల్ గాంధీ లండన్ బయలు దేరి వెళ్లారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. బ్లూ షర్టు, రెడ్ టై, అందమైన షూట్ వేసుకున్న గెటప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లెర్నింగ్ టు లిజన్ ఇన్ ది 21 సెంచురీ అనే టాపిక్ పై రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మార్చి 5వ తేదీన లండన్ నగరంలో నివసిస్తున్న భారతీయులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అదే విధంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులను కూడా కలవనున్నారు. వీటితో పాటు లండన్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
Distinguished….. @RahulGandhi. pic.twitter.com/yBiR05W5WA
— Shweta@soni (@shweta31soni) March 1, 2023
New look of Rahul Gandhi would make lots of people go crazyyy. 🔥🔥 pic.twitter.com/uuL1AYKzIG
— Amock (@Politics_2022_) March 1, 2023
The Marxian beard is history. Rahul Gandhi in Cambridge pic.twitter.com/yP3Wq7d9il
— Swati Chaturvedi (@bainjal) March 1, 2023