Bharat Jodo Yatra: దక్షిణాదిలోనే సక్సెస్… భారత్ జోడో యాత్రపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi on Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతున్నది. హర్యానాలోని కురుక్షేత్రలో యాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రకు ఉత్తరాధి కంటే దక్షిణాధినే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని, సౌత్‌లోనే యాత్ర సక్సెస్ అయినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ ఉత్తరాధిన తేదని రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు షాకయ్యారు. రాహుల్ యాత్రకు అడుగడుగున ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నేతలు నీరాజనం పలుకుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తుంతే, రాహుల్ గాంధీ ఉత్తరాధి కంటే దక్షిణాదిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు చెప్పడం విశేషం. దేశంలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ కురుక్షేత్రలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసి ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. ఉత్తరాధిపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.