Rahul Gandhi: జోడో యాత్రలో జాకెట్ ధరించిన రాహుల్
Rahul Gandhi: రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గత నాలుగు నెలలుగా విజయవంతంగా సాగుతుంది. భారత్ జోడో యాత్ర మొదలైన రోజునుండి ఇప్పటికే వరకు కేవలం వైట్ టి షర్ట్ తోనే యాత్ర సాగిస్తూ వచ్చాడు. ఈ యాత్రలో రాహుల్..ఫస్ట్ టైం జాకెట్ ధరించి కనిపించాడు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
మొదటిసారి యాత్రలో జాకెట్ ధరించి యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జమ్ములోని కతువాలో తన నడకను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ.. జాకెట్ ధరించి కనిపించారు. అలాగే యాత్రలో రాహుల్ వేసుకున్న టి షర్ట్ లపై కూడా పెద్ద రగడే నడిచిన సంగతి తెలిసిందే. రాహుల్ యాత్రపై కన్నా ఆయన వేసుకున్న టీషర్ట్ పైనే ఎక్కువ చర్చ జరిగింది..మరికొద్ది రోజుల్లో ఈ భారత్ జోడో యాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.