Raghul Gandhi: గోల్డెన్ టెంపుల్‌లో రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్ధనలు
Rahul Gandhi in Goden Temple
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నిర్వఘ్నంగా కొనసాగుతోంది. హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్ర పూర్తి కాగానే నేరుగా విమానం ఎక్కి అమృత్‌సర్ విమానాశ్రంలో ల్యాండ్ అయ్యారు. గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రేపటి నుంచి పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు. గోల్డెన్ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ సర్‌హింద్‌లోని ఫతేఘర్ సాహిబ్ ప్రాంతానికి చేరుకున్నారు.
కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రపద్రేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, రాష్ట్రాల గుండా కొనసాగింది. ప్రస్తుతం పంజాబ్‌లో కొనసాగుతోంది.
కొత్త ఏడాది ప్రారంభంలో యూపీలో 3 రోజుల పాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. జనవరి 6వ తేదీన హర్యానాలో ప్రవేశించింది. జనవరి 10 ఉదయంతో అక్కడి పాదయాత్ర పూర్తయింది. రేపటి నుంచి పంజాబ్‌లో పాదయాత్ర ప్రారంభం కానుంది. పంజాబ్‌లో లోహ్రీ సెలబ్రేషన్స్ ఉన్నకారణంగా జనవరి 12, జనవరి 13న సాయంత్రం పూట పాదయాత్ర ఉండదని సీనియర్ కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ తెలిపారు. జనవరి 14న పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని, జనవరి 15న జలంధర్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని జయరాం రమేశ్ తెలిపారు.
జనవరి 19న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం జనవరి 20 జమ్ము కశ్మీర్‌లో పాదయాత్ర ప్రవేశించనుంది.
जो सभी लोगों को बराबर मानता है, वही धार्मिक है – गुरु नानक देव जी
स्वर्ण मंदिर में कड़ा प्रसाद ग्रहण करते @RahulGandhi pic.twitter.com/8QTPouPZCD
— Congress (@INCIndia) January 10, 2023
वाहेगुरु जी, सब पर सदा अपनी मेहर बनाए रखना। pic.twitter.com/XRoyWkqGs8
— Congress (@INCIndia) January 10, 2023