కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు కోసం క్లియరెన్స్ ఇచ్చింది. మూడేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. రాహుల్ గాంధీ పొందే పాస్‌పోర్టు మూడేళ్ల పాటు చెల్లుబాటు కానుంది.
Rahul gandhi gets Passport Valid for 3 Years
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు కోసం క్లియరెన్స్ ఇచ్చింది. మూడేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. రాహుల్ గాంధీ పొందే పాస్‌పోర్టు మూడేళ్ల పాటు చెల్లుబాటు కానుంది.
ఏం జరిగిందంటే…
మోడీ పేరుపై రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. కొన్నేళ్ల క్రితం ఓ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే కేసు నమోదయింది. ఆ కేసు విచారణ ఇటీవలే అత్యంత వేగంగా జరిగింది. రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయే వరకు వచ్చింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ తన పాస్‌పోర్టును కూడా కోర్టును సరెండర్ చేయాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం తనకు సాధారణ పాస్‌పోర్టు పొందేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ కోరుతూ రాహుల్ గాంధీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్ పరిశీలించిన కోర్టు రాహుల్ గాంధీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. మూడేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా పాస్‌పోర్టు పొందవచ్చని తెలిపింది.
రాహుల్ గాంధీ అమెరికా పర్యటన
రాహుల్ గాంధీ జూన్ 4న అమెరికా వెళ్లనున్నారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారు. స్టాన్ఫోర్డు యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు.
ప్రయాణించే హక్కు ప్రాధమిక హక్కు
రాహుల్ గాంధీ విదేశీ పర్యటలను చేయడానికి వీలుగా అనుమతులు మంజూరు చేస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణపై ప్రభావం పడుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కూడా కోర్టు స్పందించింది. ఈ కేసు విచారణ 2018 నుంచి జరుగుతోందని, అప్పటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నోసార్లు విదేశీ పర్యటనలు చేశారని కోర్టు గుర్తు చేసింది. రాహుల్ గాంధీ తప్పించుకు తిరుగుతారనే భయాందోళనలు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రయాణించే హక్కు ప్రాధమిక హక్కు అని సుబ్రహ్మణ్యస్వామికి కోర్టు తెలియజేసింది.