Rahul Gandhi: ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడి జరుగుతోంది… రాయడం మానేస్తే కేసులు మాఫి
Rahul Gandhi fires on Central Govt: ప్రస్తుతం రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అనేక మంది నేతలను, వివిధ సంస్థలతో చర్చలు జరుగుపుతున్నారు. ఇటీవలే ప్రఖ్యాత క్రేంబిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆ తరువాత లండన్ పార్లమెంటులో ప్రసంగించారు. అనంతరం, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని సంస్థలపైనా దాడులు జరుగుతున్నాయని, ముఖ్యంగా జర్నలిస్టులు నోరు ఎత్తకుండా ఉండేలా కేంద్రం దాడులను పాల్పడుతోందని విమర్శించారు.
ఈ దాడులను తిప్పికొట్టేందుకు దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలోని బీబీసీ సంస్థలపై దాడులును నిరసించేవారిని అణిచివేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఆయా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం నిలిపివేస్తే కేసులు అన్నీ మాఫీ అవుతాయని అన్నారు. అన్ని వ్యవస్థలు దాడులకు గురౌతున్నాయని, బడుగు బలహీన వర్గాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇండియా చైనా బోర్డర్ విధానంపై విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలను కూడా ఆయన విమర్శించారు.