Rahul Bharat Jodo Yatra: జనవరి 30న శ్రీనగర్‌లో ముగింపుసభ
Rabul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో కొనసాగుతున్నది. ఈనెల 30వ తేదీతో రాహుల్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ముగియనున్నది. ఈ ముగింపు సభను శ్రీనగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున జనసమీరణ చేపట్టేందుకు సిద్దమౌతున్నారు. ఇక, రాహుల్ సభకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకోగానే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను చేపట్టనున్నారు.
జనవరి 26వ తేదీ నుండి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్నారు. భద్రాచలం నుండి ఈ యాత్ర ప్రారంభం కానున్నది. గడపగడపకు పార్టీని తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ యాత్ర ముగిసిన తరువాత రేవంత్ రెడ్డి చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ యాత్ర ద్వారా దేశంలోని బీజేపీని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి వర్గం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.