Rahul Gandhi about London speech: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు
Rahul Gandhi about London speech: రాహుల్ గాంధీ ఇటీవలే బ్రిటన్ లో పర్యటించారు. బ్రిటన్‌లో పర్యటించిన సమయంలో ఆయన భారత్‌పై పలురకాల విమర్శులు చేశారు. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ విషయంపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా బ్రిటన్ వెళ్లి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. స్వయంగా ప్రధాని మోడీ సైతం దీనిపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, తాను బ్రిటన్‌లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అవకాశం ఇస్తే పార్లమెంటులో నేను మాట్లాడతానని అన్నారు. పార్లమెంటులో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుంటే పార్లమెంటు బయట మాట్లాడతానని, తానేం మాట్లాడానో వాళ్లకు చెబుతానని అన్నారు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం తన ఉద్దేశం కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ సైతం రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పేందుకు ఒప్పుకోలేదు. అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలా చేస్తోందని కాంగ్రెస్ వాధిస్తోంది. ఏది ఏమైనా సరే రాహుల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని కమలనాధులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రోజున పార్లమెంటు ఉభయ సభల్లో రభస జరిగింది. కాగా, ఆరోజు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రెస్‌మీట్‌లో లండన్‌లో మాట్లాడిన విషయాలను మీడియాతో పంచుకునే అవకాశం ఉంది.