Rahul Gandhi: జనవరి 30న శ్రీనగర్‌లో రాహుల్ జోడో యాత్ర ముగింపు..భారీ బహిరంగ సభ
Rahul Gandhi: కాంగ్రెస్ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ చివరి దశకుచేరుకుంటోంది. ఈ నెల 30 న శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగియనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర దాదాపు 3,500 కి.మీ దూరం కొనసాగి జనవరి 30న శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతోపాటు అభిమానులు,పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
భారత్ జోడో యాత్ర ఇవాళ 132వ రోజుకు చేరింది. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షంలోనే నడక సాగించారు రాహుల్. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పలు రహదారులు మూసుకుపోయాయి. దాంతో బుధవారం నాటి యాత్రను రద్దు చేశారు. నేడు మళ్ళీ తిరిగిప్రారంభించనున్నారు
జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపు కానుంది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో భావసారూప్యత కలిగిన 21 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు. జనవరి 30న శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది. మరో నాలుగు రోజులే సమయం ఉండడంవల్ల ఇప్పటికే పార్టీ పెద్దలు శ్రీ నగర్ కు చేరుకున్నారు. సభకి సంబంధించి అన్నివ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. భారీ ఎత్తులో పార్టీశ్రేణులు రానున్న నేపథ్యంలో భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేయనున్నారు.