Punjab : ఐపీఎస్ అధికారిణిని పెళ్లిచేసుకోబోతున్న పంజాబ్ మంత్రి
Punjab : ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్ ని వివాహం చేసుకోబోతున్నారు పంజాబ్ మంత్రి, హరజోత్ సింగ్ బెయిన్స్ గతేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూప్నాపూర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా హరజోత్ గెలుపొందారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాన్ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు హరజోత్. ఐపీఎస్ అధికారిని జ్యోతి యాదవ్.. మన్సా జిల్లా ఎస్పీగా ఉన్నారు. రెండు రోజుల కిందటే వీరిరువురి ఎంగేజ్ మెంట్ అయిందని తెలిపారు.
2017 ఎన్నికల్లో సహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆప్ యువజన విభాగం అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆతరువాత నిర్వహించిన ఎన్నికల్లో ఆనంద్‌పూర్ నుండి గెలిచి మొదటి టర్మ్ లోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్న సందర్బంగా పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మీ జీవితాలు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాయంటూ అభినందనలు తెలిపారు.