Praveen Sood took charge as the New CBI Director
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎల్ అధికారి ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టారు. వచ్చే రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉండనున్నారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన అధికారి.
సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియామకంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూద్, ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పాలు పంచుకున్నారు.
ప్రవీణ్ సూద్ నియామకం మే 14వ తేదీన జరిగింది. ఇంత కాలం సీబీఐ డైరెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన సుబోధ్ జైస్వాల్ పదవీ కాలం నేటితో (మే 25తో) ముగిసింది. దీంతో కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రవీణ్ సూద్ కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా 2013 నుంచి 2014 వరకు పనిచేశారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా సేవలు అందించారు.
కర్ణాటక డీజీపీగా కూడా ప్రవీణ్ సూద్ సేవలు అందించారు. ప్రవీణ్ సూద్‌పై కాంగ్రెస్ నేత శివకుమార్ గతంలో అనేక సార్లు విమర్శలు చేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రవీణ్ సూద్ ఎంతో పక్షపాతంతో వ్యవహరించారని, కాంగ్రెస్ నేతలపై 25 కేసులు పెట్టిన ప్రవీణ్ సూద్, బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని శివకుమార్ విమర్శలు గుప్పించారు.
1986-batch IPS Praveen Sood takes over as the new #CBI Director. He will lead the agency for next two years. @Copsview @CBIHeadquarters pic.twitter.com/4DmkLAqBCF
— Abhishek Shukla (@Hack_Hound_) May 25, 2023
..