Amritpal Singh: సినీఫక్కీలో తప్పిన్చుకున్న అమృత్‌పాల్
Amritpal Singh: ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు, రాడికల్ ఆర్గనైజేషన్ ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ స్పెషల్ టీమ్ పోలీసులకు చిక్కినట్టే చీకి వెంటనే తపించుకున్నాడు. విద్వేష వ్యాఖ్యలతో అత్యంత సమస్యాత్మకంగా మారిన అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహం పన్నినా చివరి క్షణంలో జంప్ అయ్యాడు.
అమృత్‌పాల్ తన అనుచరులతో కలిసి జలంధర్ జిల్లాలోని షాకోట్ తాలూకాకు వెళ్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో.. స్పెషల్ టీమ్ పోలీసులు నిఘా పెట్టారు. ముందుగా షాకోట్‌లో అన్ని వైపులా రహదారులను బారీకేడ్లతో మూసివేశారు. అమృత్‌పాల్ మద్దతుదారులు ప్రతిసారి అతడిని పోలీసులకు చిక్కకుండా తప్పిస్తుండటంతో ఈసారి పకడ్బందీ ప్లాన్ తో పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్నెట్ సేవలను బంద్ చేసారు. అతడి సమాచారాన్ని ఎవరికితెలియకుండా పక్క సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటూ అమృత్‌పాల్ ఉన్న చోటుకు చేరుకోగానే అలర్ట్ అయిన అయన అనుచరులు ఆయనను తప్పించే ప్రయంత్నం చేసారు.
మొత్తం ఏడు జిల్లాల్లో అమృత్ పాల్ కాన్వాయ్‌ని చేజ్ చేశారు. ఈ చేజింగ్‌లో మొత్తం 100 పోలీస్ కార్లు పాల్గొన్నాయి. చివరికి నిందితుల కాన్వాయ్ షాకోట్ తాలూకాకు చేరుకుని రోడ్లన్నీ మూసివుండటంతో పోలీసులకు చిక్కింది. అమృత్‌పాల్ సింగ్‌ను స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అయితే పోలీసుల కళ్లుగప్పి అమృత్‌పాల్ ఓ బైక్‌పై పరారయ్యాడని చెబుతున్నారు పోలీసులు .