PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల, రైతుల ఖాతాల్లోకి 16,800 కోట్లు జమ
PM Narendra Modi releases Rs 16,000 Crore for Over 8 Crore Eligible Farmers
దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు అందాయి. 16,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరుకున్నాయి. కర్ణాటకలోని బెల్గావీలో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లోకి నిధులను జమచేశారు. ఇప్పటి వరకు 12 విడతలుగా ఈ కార్యక్రమం ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులను అందించారు. తాజాగా 13వ విడత నిధులను కూడా క్రమం తప్పకుండా విడుదల చేశారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలో అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. ప్రతి ఏటా 3 సార్లు రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల అవుతున్నాయి. ప్రతిసారి 2 వేల చొప్పున ఏడాది 6 వేల రూపాయల ఆర్ధిక సాయం రైతులకు అందుతోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి 2.30 లక్షల కోట్లు జమచేసినట్లయింది.
పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభం అయింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతూనే ఉన్నాయి. గత ఏడాది మే నెలలో 11వ విడద నిధులు విడుదల కాగా, అక్టోబర్ నెలలో 12వ విడత నిధులు విడుదల అయ్యాయి.తాజాగా 13వ విడత నిధులు రైతుల ఖాతాల్లోకి చేరాయి.
నిధులు విడుదల చేసిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. గత ప్రభుత్వాల అలసత్వాన్ని ఎండగట్టారు. గత పాలకులు దేశంలోని చిన్న సన్నకారు రైతులను నిర్లక్ష్యం చేశారని, బీజేపీ పాలన మొదలైన దగ్గర నుంచ చిన్నరైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు.
Small farmers have been neglected for decades, but these farmers are our priority under BJP’s rule.
Rs 2.5 Lakh crore has been deposited through PM Kisan Samman Nidhi in the accounts of our farmers.
– PM @narendramodi pic.twitter.com/DL8qjujmYC
— BJP (@BJP4India) February 27, 2023
Jai Kisan !
प्रधानमंत्री श्री @narendramodi द्वारा कर्नाटक के बेलगावी में पीएम किसान सम्मान निधि की 13वीं किस्त के रूप में 8 करोड़ से अधिक लाभार्थी किसानों के बैंक खातों में ₹16,800 करोड़ से अधिक की राशि जारी की गई।#PMKisan13thInstallment #PMKisan #aatmanirbharkisan #ModiGovt pic.twitter.com/3oS7VMMvQp
— Prakash Javadekar (@PrakashJavdekar) February 27, 2023
माननीय प्रधानमंत्री श्री @narendramodi, आज 27 फरवरी 2023, दोपहर 3 बजे कर्नाटक में प्रधानमंत्री किसान सम्मान निधि की 13वीं किस्त, 8 करोड़ से अधिक लाभार्थी किसानों के बैंक खातों में सीधे हस्तांतरित करेंगे।#PMKISAN #FarmersFirst#4YearsofPMKisan#agrigoi #G20India@nstomar @g20org pic.twitter.com/Ia9YNU5AdD
— Agriculture INDIA (@AgriGoI) February 27, 2023
प्रधानमंत्री श्री @narendramodi द्वारा कर्नाटक के बेलगावी में पीएम किसान सम्मान निधि की 13वीं किस्त के रूप में 8 करोड़ से अधिक लाभार्थी किसानों के बैंक खातों में ₹16,800 करोड़ से अधिक की राशि जारी की गई। #PMKisan pic.twitter.com/uTySjsEyFP
— BJP (@BJP4India) February 27, 2023