PM MODI: జపాన్‌లో జీ-7 శిఖరాగ్ర సదస్సు (G-7 SUMMIT) జరగనుంది. అమెరికా అణుదాడిలో అతలాకుతలమైన షిరోషిమా (Hiroshima) పట్టణంలో మే 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ (PM MODI) శుక్రవారం ఉదయం జపాన్‌కు బయల్దేరి వెళ్లారు. మూడు రోజుల పాటు జపాన్‌లో మోడీ పర్యటించనున్నారు.
PM MODI: జపాన్‌లో జీ-7 శిఖరాగ్ర సదస్సు (G-7 SUMMIT) జరగనుంది. అమెరికా అణుదాడిలో అతలాకుతలమైన షిరోషిమా (Hiroshima) పట్టణంలో మే 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ (PM MODI) శుక్రవారం ఉదయం జపాన్‌కు బయల్దేరి వెళ్లారు. మూడు రోజుల పాటు జపాన్‌లో మోడీ పర్యటించనున్నారు. జీ-7 సదస్సులో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో పాటు ప్రపంచ సవాళ్లపై మోడీ ప్రసంగించనున్నారు. అలాగే ప్రపంచస్థాయి నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
ఈ మేరకు మోడీ జపాన్ వెళ్లే ముందు ట్వీట్ చేశారు. ‘‘భారత్ జీ-20 సదస్సుకు అధ్యక్షత వహిస్తోన్న సమయంలో జీ-7 సదస్సులో పాల్గొనడం అర్థవంతమైనది. హిరోషిమాలో జరుగుతోన్న జీ-7 సదస్సు కోసం జపాన్ (Japan) బయలుదేరాను. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాను’’ అంటూ మోడీ ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే జపాన్ పర్యటనలో భాగంగా మోడీ హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇక జీ-7 సదస్సులో భాగంగా మోడీ మే 20, మే 21 తేదీలలో జరగనున్న రెండు అధికారిక సెషన్లలో పాల్గొననున్నారు. మొదటి సెషన్ ఆహారం, అభివృద్ధి, ఆరోగ్యం, లింగ సమానత్వంపై ఉంటుంది. రెండవ సెషన్ వాతావరణం, శక్తి, పర్యావరణంపై అనే అంశాలపై ఉంటుంది. ఇకపోతే జీ-7లో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.
Leaving for Japan, where I will be joining the @G7 Summit in Hiroshima. Looking forward to a healthy exchange of views on diverse global subjects. https://t.co/TYYOLeHAFH
— Narendra Modi (@narendramodi) May 19, 2023