New Parliament: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన పార్లమెంట్ భవనాన్ని (New Parliament building) నిర్మించిన విషయం తెలిసిందే. దానిని మే 28న ప్రధాని మోడీ (PM modi) ప్రారంభించనున్నారు.
New Parliament: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన పార్లమెంట్ భవనాన్ని (New Parliament building) నిర్మించిన విషయం తెలిసిందే. దానిని మే 28న ప్రధాని మోడీ (PM modi) ప్రారంభించనున్నారు. ఈక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆసక్తికరమైన ప్రకటన చేశారు. దేశ సంస్కృతి, చారిత్రక నేపథ్యాలు నేటి తరానికి తెలిసేలా నూతన పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం సెంగోల్‌ను ఉంచనున్నట్లు ప్రకటించారు. దానిని తమిళ ఆదివాసీల నుంచి మోడీ మే 28న స్వీకరిస్తారని చెప్పారు. దానిని పార్లమెంట్ భవనంలో స్పీకర్ సీటు వద్ద మోడీ ఉంచుతారని వెల్లడించారు.
చోళుల కాలం నుంచి ఈ రాజదండంకు చాలా విశిష్టత ఉందని అమిత్ షా వెల్లడించారు. ఈ బంగారు సెంగోల్ స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా ముఖ్యమైన చారిత్రక చిహ్నమని తెలిపారు. బ్రిటీష్ వారి నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడాన్ని ఈ రాజదండం సూచిస్తుందని అమిత్ పేర్కొన్నారు.
ఇకపోతే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటీషర్లు దేశం వదిలి వెళ్తూ.. రాజదండం సెంగోల్‌ను మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అందజేసి వెళ్లారు. ఈ రాజదండం బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడాన్ని సూచిస్తుంది. తమిళంలోని సెమ్మై అనే పదం నుంచి సెంగోల్ అనే పదం వచ్చింది. తమిళంలో సెమ్మై అంటే ధర్మం అని అర్థం.
PM Modi will dedicate the newly constructed building of Parliament to the nation on 28th May. A historical event is being revived on this occasion. The historic sceptre, 'Sengol', will be placed in new Parliament building. It was used on August 14, 1947, by PM Nehru when the… pic.twitter.com/NJnsdjNfrN
— ANI (@ANI) May 24, 2023