PM Modi: ఉచితాలపై పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు… ఆర్థిక వ్యవస్థలు నాశనం
PM Modi: ప్రధాని మోడీ ఆదివారం రోజున మహారాష్ట్రలో పర్యటించారు. రాష్ట్రంలో 75 వేల కోట్ల రూపాయలతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 8 సంవత్సరాలుగా ప్రజల మైండ్ సెట్‌ను మార్చి సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే పేరుతో పనిచేస్తున్నామని, అయితే, కొందరు షార్ట్ కట్‌రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉచితాలను ప్రకటిస్తూ రాజకీయాల్లో ఎదగాలని చూస్తున్నారని, ఉచితాల ద్వారా దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు నాశనం అవుతాయని అన్నారు. షార్ట్ కట్ రాజకీయా నేతలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉచితాల ద్వారా భవిష్యత్ నాశనం అవుతుందని, ఆర్థిక వ్యవస్థలకు పరిపుష్టి లేకుంటే దేశం చిన్నాభిన్నం అవుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని హెచ్చరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం పురోగమిస్తుందని అన్నారు. ఇక నాగపూర్‌తో షిర్డీని అనుసంధానించే నాగపూర్ ముంబై సమృద్ది ఎక్స్‌ప్రెస్ వేని, నాగపూర్ తొలిదశ మెట్రోను ప్రధాని ప్రారంభించారు. కాగా, ప్రధాని మోడీ స్వయంగా మెట్రో టికెట్ కొనుక్కొని మెట్రోరైల్లో ప్రయాణం చేశారు. ప్రయాణం సమయంలో విద్యార్థులు, స్థానికులతో ప్రధాని ముచ్చటించారు.