Pm Modi: ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులు ఆపండి..మోదీ
Pm Modi: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశ ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడి కొనసాగుతోంది. అది చాల బాధాకరమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో ఉన్న ఆలయం గోడలపై భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసినట్లు స్థానిక మీడియా బయటపెట్టిన విషయం తెలిసిందే.
హిందువులను భయపెట్టేందుకు సిక్స్ ఫర్ జస్టిస్ చేస్తున్న పద్ధతిలోనే తాజా ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయని హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ గతంలో ఆరోపించారు. ఈ చర్యలు మంచివికావని అక్కడి దేవాలయాలకు రక్షణ కల్పించాలని ఆసీస్ ప్రధాని ని కోరారు. హిందూ దేవాలయాలపై దాడుల అంశంలో భారతీయుల ఆవేదనను ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్ట్రేలియాలో భారతీయుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నానని అల్బనీస్ తనకు భరోసా ఇచ్చారని మోదీ తెలిపారు. అయితే దేవాలయలపై దాడుల అంశాన్ని విలేకరుల సమావేశంలో అల్బనీస్ ప్రస్తావించలేదు.