PM Modi: శభాష్ బండి..ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం ఎన్‌డిఎంసి కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బిజెపి ఇప్పటివరకూ లక్షా 30 వేల పోలింగ్ బూత్‌లలో బలంగా ఉందని, బలహీనంగా ఉన్న 72 వేల పోలింగ్ బూత్‌లను బలోపేతం చేయాలని అన్నారు. ఈ సమావేశాలకు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని శెభాష్ బండిజి అంటూ పొగిడారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రను అద్భుతమని కొనియాడారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం సంజయ్ కృషిని అభినందించారు. సంజయ్ మంచి వక్త.. ఆయన మాట్లాడుతుంటే వెంకయ్యనాయుడు గుర్తుకు వస్తారని మోదీ కితాబునిచ్చారు.
బీజేపీ రాజకీయ కార్యకలాపాల గురించి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతున్న సందర్భంగా సంజయ్‌కు అవకాశం వచ్చింది. ఆయన హిందీలో మాట్లాడబోతుంటే మోదీ కలుగచేసుకుని బావోద్వేగాలగురించి మాతృభాషలో మాట్లాడుతుంటే బాగుంటుందని తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించారు. సంజయ్ యాత్ర అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని, అయితే ఆయన తన గురించి తాను చెప్పుకోరని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. సంజయ్ తెలుగులో మాట్లాడుతుంటేనే బాగా ఉంటుందన్నారు.
తన యాత్రకు విశేష స్పందన లభించడానికి కారణం.. మోదీపై ప్రజల అభిమానం, కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకతేనని చెప్పారు. తెలంగాణలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయన్నారు. ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని, నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని, అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందన్నారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్‌ను కూడా సంజయ్ ప్రశంసించారు.