Triveni drives BJP’s success: ఈశాన్య రాష్ట్రాల అభివృద్దే విజయాలకు నాంధి
Triveni drives BJP’s success: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వియజభేరి మోగించింది. త్రిపుర, నాగాలాండ్‌లో స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ రెండు రాష్ట్రాల్లో తిరిగి పాలనలోకి రాబోతుండగా, మేఘాలయలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మూడు రాష్ట్రాల ఫలితాల అనంతరం ప్రధాని మోడీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను, మీడియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈశాన్యరాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి, పార్టీ కార్యకర్తల అంకితభావంవలనే విజయం సాధించగలిగినట్ల మోడీ తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పారని అన్నారు. ఢిల్లీ నుండి ఈశాన్య దూరం కాదని, తమ హృదయాల నుండి కూడా దూరం కాదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు బీజేపీని భూస్థాపితం చేస్తామని ప్రచారం చేశాయని, ప్రజల విశ్వాసంతో కమలం వికాసం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా భావిస్తే బీజేపీ అవినీతి రహితంగా మార్చామని, అదే తమ విజయాలకు మూల కారణమైందని జేపీ నడ్డా పేర్కొన్నారు.