PM Modi: ప్రధాని ప్రారంభించిన గంగా విలాస్ రివర్ క్రూయిజ్ టూర్ విశేషాలు మీకు తెలుసా?
PM Modi flags off Ganga Vilas
భారతదేశంలో టూరిజం రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. టూరిస్టులను ఆకట్టుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన యాత్రలకు స్వీకారం చుడుతున్నారు. తాజాగా నదుల విహారం చేస్తూ టూరిజం స్పాట్ లను తిలకించే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ఎంపీ గంగా విలాస్ పేరుతో రివర్ క్రూయిజ్ యాత్రను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారి ఇటువంటి యాత్ర జరగడం విశేషం. 51 రోజుల పాటు 50 పర్యాటక ప్రాంతాలను ఈ యాత్ర ద్వారా చూసేందుకు టూరిస్టులకు అవకాశం కలగనుంది.
రివర్ క్రయూజ్ యాత్రలో హెరిటేజ్ సైట్లు, జాతీయ పార్కులు, రివర్ ఘాట్లు దర్శనమివ్వనున్నాయి. వాటితో పాటు పాట్నా నగరం, జార్ఖండ్ లో సాహిబ్ గంజ్, కోల్ కతా నగరం, గౌహతి నగరం తదితర 50 ప్రదేశాల గుండా ప్రయాణం సాగనుంది.
ఈ రోజు ప్రారంభమైన క్రూయిజ్ యాత్ర మార్చి 1 వరకు కొనసాగనుంది. మొత్తం 80 మంది టూరిస్టులకు ఇందులో ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. విలాసవంతమైన 18 సూట్లు పర్యాటకులకు మరుపురాని అనుభూతులను అందించనుంది.
కొత్తగా ప్రారంభమైన క్రూయిజ్ టూర్ ను ఆస్వాదించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ప్రధాని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొన్ని విషయాలను చెప్పడానికి సాధ్యపడదని, స్వయంగా అనుభవించి తెలుసుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ టూర్ ద్వారా తెలుసుకునే అవకాశం కలగనుందని ప్రపంచ పర్యాటకులకు ప్రధాని మోడీ తెలిపారు
India welcomes all our tourist friends from different parts of the world.
Come, explore the vibrancy of our country! pic.twitter.com/7LiA2beUkq
— PMO India (@PMOIndia) January 13, 2023
MV Ganga Vilas will begin its journey from Varanasi in Uttar Pradesh and travel around 3,200 km in 51 days to reach Dibrugarh in Assam via Bangladesh, sailing across 27 river systems in India and Bangladesh.#WorldsLargestRiverCruise #GangaVilas #CruiseTourism pic.twitter.com/wChBZvLRYX
— Ministry of Tourism (@tourismgoi) January 13, 2023