PM Modi fires on Congress: రోడ్లు అభివృద్ధి చేస్తున్నా… కాంగ్రెస్ సమాధి తవ్వుతోంది
PM Modi fires on Congress: నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాను రోడ్లు, అభివృద్ది కోసం కృషి చేస్తుంటే, కాంగ్రెస్ తనకు సమాధి తవ్వుతోందని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడుగడుగున అడ్డంకులు కల్పిస్తోందని విరుచుకుపడ్డారు. పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించాలమని, ఈ కార్యక్రమాల ద్వారా పేదలకు సహాయం చేస్తున్నామని అన్నారు. దేశాభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలతో తాను తీరిక లేకుండా ఉన్నానని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమయాన్ని ప్రజలకోసం కాకుండా విదేశీ యాత్రలు చేస్తూ అక్కడ భారత ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో ప్రశ్నించడం ఏంటని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉంటే భారత్‌లోనే ఉండి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. తనకు ప్రజల ఆశిస్సులు ఉన్నాయని, ప్రజలే తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ఏం కావాలన్నా వారే చూసుకుంటారని అన్నారు. ప్రజల ఆశిస్సులే తనకు రక్షణ కవచమని తెలిపారు. ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు బీజేపీ జెండా రెపరెపలాడుతున్నది.