Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) మే 28న ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) ప్రారంభించనున్నారు.
Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) మే 28న ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) ప్రారంభించనున్నారు. అయితే నూతన భవనాన్ని దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి (President) కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించడం రాజకీయ దుమారానికి దారి తీసింది. మోడీ ప్రారంభించడం పట్ల ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) స్పందిస్తూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రథమ పౌరురాలిని అవమానిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం నిర్వహించకపోవడం, ఈ వేడుకలకు ఆహ్వానించకపోవడం.. రాజ్యాంగ అధినేతను అవమానించడమే అని మండిపడ్డారు. పార్లమెంట్ అంటే.. అహంకారపు ఇటుకలతో కట్టిన నిర్మాణం కాదని.. రాజ్యాంగ విలువలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
మరోవైపు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ లోక్సభ సచివాలయ కార్యదర్శి ఆహ్వానం పంపగా.. మొత్తం 19 పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ముందుగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత టీఎంసీతో సహా మొత్తం 19 పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోందని.. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
राष्ट्रपति से संसद का उद्घाटन न करवाना और न ही उन्हें समारोह में बुलाना – यह देश के सर्वोच्च संवैधानिक पद का अपमान है।
संसद अहंकार की ईंटों से नहीं, संवैधानिक मूल्यों से बनती है।
— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2023