Parliament Budget Sessions: నేటి నుండి రెండోదశ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు
Parliament Budget Sessions: నేటి నుండి పార్టమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండోదశ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. కాగా, ఫిబ్రవరి 14వ తేదీ వరకు తొలిదశ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. రెండో దశ పార్లమెంట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యి ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలు సజావుగా కొనసాగేలా సహకరించాలని ఇప్పటికే అధికారపార్టీ విపక్షాలను కోరింది.
కాగా, తాము నిరసనలు కొనసాగిస్తామని ప్రతిపక్షాలు మరోసారి స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యూహాలను అమలు చేయాలి, ఎలా అధికారపార్టీని ఎదుర్కోవాలనే దానిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల నేతలు భేటీ అయ్యి చర్చించనున్నారు. దేశంలోని సమస్యలపై గళం వినిపించనున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రెండోదశ పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎన్ని బిల్లులకు ఆమోదం లభిస్తుందో చూడాలి.