New Niti Aayog CEO : పరమేశ్వరన్ అయ్యర్ కు బాధ్యతలు
నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా మాజీ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ పరమేశ్వరన్ అయ్యర్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈఓ అభితాబ్ కాంత్ పదవీకాలం జూన్ 30తో ముగియనుండటంతో, ఆయన స్థానంలో అయ్యర్ నియమితులయ్యారు. అయ్యర్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981-బ్యాచ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ పారిశుధ్య నిపుణుడు. అయ్యర్ 2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి శానిటేషన్ స్పెషలిస్ట్‌గా కూడా పనిచేశాడు. అయ్యర్ రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.